తెలంగాణ
ఆర్ఎంపీ ఇంజెక్షన్ వేయడంతో రోగి మృతి

ఆర్ఎంపి వైద్యుడు ఇంజక్షన్ వేయడంతో తన భర్త మరణించాడని పెద్దపల్లి జిల్లా చీకుర్తిలో మహిళ బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. మొండెద్దుల ఆంజనేయులు వారం రోజుల క్రితం అనారోగ్య సమస్య తలెత్తి చీకురాయి గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుని వద్దకు వెళ్లారు.
డాక్టర్ ఇంజక్షన్ వేయడంతో తన భర్త మరణించాడంటూ మహిళ ఆర్ఎంపీ వైద్యుని ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. మహిళకు అండగా నిలిచిన గ్రామస్తులు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.



