తెలంగాణ
భార్యను గొంతు నులిమి చంపిన భర్త

భద్రాద్రి కొత్తగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను గొంతు నులిమి చంపాడు ఓ భర్త బూర్గంపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన షంషీర్ పాష, సోని భార్య భర్తలు వీరికి 12 ఏళ్ళ కూమారుడు కూడా ఉన్నాడు.ఆర్థిక సమస్యల వల్ల ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భర్త గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నిందితుడు పీఎస్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు



