తెలంగాణ
తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతన్నల ఇబ్బందులు

తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో ఓ ఫెర్టిలైజర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఫెర్టిలైజర్ షాప్‌కు 120 యూరియా బస్తాలు రాగా సుమారు 200 మంది రైతులు పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం యూరియా కొరత లేకుండా అందజేయాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.



