తెలంగాణ
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా కొనసాగుతున్న వరద

నాగార్జున సాగర్‌కు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద కొనసాగుతుంది. అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3లక్షల 18వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 586 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటినిల్వ 303 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.



