తెలంగాణ
Bandi Sanjay: ప్రజాసంగ్రాయ యాత్రలో వచ్చిన ఆలోచనే సైకిళ్ల పంపిణీ

Bandi Sanjay: కష్టాల్లో పుట్టిపెరిగిన తనకు తోటివారి కష్టాలు తెలిసినందునే పేద పిల్లల్లకు సైకిళ్ల పంపిణీ చేస్తున్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. చిన్నారుల కనీస అవసరాలు తీర్చగలిగితే వారు విద్యపై దృష్టిపెట్టి ప్రయోజకులు అవుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిధిలోని వేములవాడవాడ అసెంబ్లీ సెగ్మెంట్లో మోడీ గిఫ్ట్ పేరుతో సైకిళ్ల పంపిణీ చేసిన సంజయ్ తానెప్పుడూ పేదల పక్షపాతినేనని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో పేదల కష్టాలు చూసానని అందులోనుంచి వచ్చిన ఆలోచనే సైకిళ్ల పంపిణీ అని సంజయ్ తెలిపారు.



