జాతియం
రాహుల్‌తో కలిసి ‘ఓటర్ అధికార్’ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

బిహార్‌లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర కొనసాగుతోంది. యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొన్నం, పొంగులేటి పాల్గొన్నారు. బిహార్‌లో ఓట్ల తొలగింపుపై రాహుల్ పోరాటం చేస్తున్నారు. ఓటరు జాబితాలో అక్రమాలను ఎండగట్టడానికి, ఓటు హక్కును కాపాడేందుకే యాత్ర చేపట్టినట్లు రాహుల్ తెలిపారు.



