ఆంధ్ర ప్రదేశ్

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 33 అజెండా అంశాలకు ఆమోదం

AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. కేబినెట్ భేటీలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. 51వ సీఆర్‌డీఏ సమావేశం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాజధాని పరిధి 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపింది.

ఏపీ సర్క్యులర్‌ ఎకానమీ, వేస్ట్‌ రీస్లైకింగ్‌ పాలసీ 4.0 2025-30కి ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేసింది. సీఆర్‌డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 2వేల 778 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button