ఆంధ్ర ప్రదేశ్
ఎలుగు బంటి హల్ చల్ .. వ్యక్తిపై దాడి

Anantapur: అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో ఎలుగు బంటి హల్ చల్ చేసింది. పెన్నోబిలేష్ అనే వ్యక్తిపై ఎలుగుబంటి విచక్షణ రహితంగా దాడి చేసింది. సీతాఫలాల పండ్ల కోసం చిన్న ఎర్రగొండ అనే కొండ అటవీ ప్రాంతం లో బిలేష్ వెళ్తుండగా ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన పెన్నోబులేష్ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుందుర్పి అటవీ ప్రాంతంలో ఎలుగుబంట్లు తరచూ సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఎలుగుబంట్లను కట్టడి చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.



