ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు

Chandrababu: పంద్రాగస్టు వేడుకల్లో బనకచర్లపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సముంద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తున్నామని తెలిపారు.
ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నామని.. అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటని అడిగారు. వరదను భరించాలి కానీ.. ఆ నీటిని వాడుకోవద్దా అని చంద్రబాబు ప్రశ్నించారు.



