ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో దొంగల హల్‌చల్

Tirumala: తిరుమలలో దొంగలు హల్‌చల్ చేశారు. గత రాత్రి తమిళనాడుకు చెందిన కారులో చోరీకి పాల్పడ్డారు. నారాయణగిరి కార్ పార్కింగ్ వద్ద కారు అద్దాలు పగులగొట్టి కారులో చోరీకి పాల్పడ్డారు. సుమారు 40 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. ఘటనపై తిరుమల క్రైమ్ పోలీసులకు భక్తులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



