తెలంగాణ
Ponnam: పార్లమెంట్ వద్ద ఎంపీల అరెస్ట్‌ను ఖండిస్తున్నాం

Ponnam: పార్లమెంట్ వద్ద ఖర్గే, రాహుల్, ప్రియాంక, ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై ఉద్యమం చేస్తున్నారని అన్నారు. శాంతియుత ర్యాలీ ద్వారా ఈసీకి వినతి పత్రం సమర్పించాలని భావించిన మా నాయకులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.



