ఆంధ్ర ప్రదేశ్
మంత్రి నారా లోకేష్‌కు రాఖీలు కట్టిన మహిళలు

అమరావతిలోని సీఎం నివాసంలో రక్షా బంధన్ వేడుకలు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు మంత్రి నారా లోకేష్‌కు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు. మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని నారా లోకేష్ అన్నారు. ఆడపడుచుల ఆశీస్సులతో మంగళగిరిని నెంబర్ 1గా తీర్చిదిద్దుతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నానని అన్నారు.



