సినిమా
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి రమ్యకృష్ణ

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర, సినీ నటి రమ్యకృష్ణ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలోసిక్కిం సీఎం ప్రేమ్ సింగ్,పరమేశ్వర, సినీ నటి రమ్యకృష్ణ కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.



