తెలంగాణ
ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ

ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్ట్స్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వినతులు ఇచ్చారు. విజయవాడ హైవేపై నిర్మిస్తున్న డబుల్ డెక్కర్ కారిడార్‌పై కేంద్రం సహకారం కోరారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కీలక అంశాలపై నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చర్చించారు.



