తెలంగాణ
Srinivas Goud: ఘోష్ రిపోర్ట్ కాదు..కాంగ్రెస్ రిపోర్ట్

Srinivas Goud: కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ను బద్నామ్ చేసేందుకే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం పూర్తయితే కాంగ్రెస్ హయాంలో మిగతా 10 శాతం ఎందుకు పూర్తి చేయడం లేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
కేసీఆర్ సర్కార్ రైతులపై ప్రేమతోనే ప్రాజెక్టులు కట్టిందని, నిరంతర ఉచిత విద్యుత్ అందించిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను బ్లేమ్ చేసేందుకు చీఫ్ పాలిటిక్స్ ప్లే చేస్తోందని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు.



