తెలంగాణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్ష బీభత్సం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పెదవాగు ప్రాజెక్టు వరుణుడి ప్రతాపానికి నామరూపాలు లేకుండా పోయింది. గతేడాది ఇదే రోజున కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు తునాతునకలైపోయి కొట్టుకుపోయింది. పెద్ద జలాశయంలా నిత్యం నీళ్లతో కళకళలాడే ప్రాజెక్టు గడ్డి దిబ్బలుగా మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 16 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది.



