Shubhanshu Shukla: భూమిపైకి తిరిగి వచ్చిన శుభాంశు శుక్లా బృందం

Shubhanshu Shukla: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల చరిత్రాత్మక మిషన్‌ను పూర్తి చేసి భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్, ఆక్సియం-4 ప్రైవేట్ స్పేస్‌ఫ్లైట్‌లో భాగంగా జరుగుతోంది. దీని ద్వారా భారతదేశం 41 సంవత్సరాల తర్వాత మానవ అంతరిక్ష యాత్రలో మరో మైలురాయిని సాధించింది. 1984లో రాకేష్ శర్మ సోవియట్ మిషన్‌లో సల్యూట్-7కి వెళ్లిన తర్వాత, శుభాంశు శుక్లా ఐఎస్ఎస్‌కు చేరుకున్న మొదటి భారతీయ వ్యోమగామిగా నిలిచారు.
శుభాంశు శుక్లా, ఆయన సహచర వ్యోమగాములైన కమాండర్ పెగ్గీ విట్సన్ , స్లావోస్జ్ ఉజ్ఞాన్స్కీ-విస్నియేవ్స్కీ , టిబోర్ కపు .. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోISS హార్మోనీ మాడ్యూల్ నుంచి అన్‌డాక్ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది.. అన్‌డాకింగ్ తర్వాత, డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ భూమి వాతావరణంలోకి ప్రవేశించి కాలిఫోర్నియా తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్‌డౌన్ అయ్యారు.
ఈ రిటర్న్ జర్నీ సుమారు 22 గంటలు పడుతుంది, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఒక గంట మార్జిన్ ఉంటుంది. శుభాంశు శుక్లా అక్కడ 18 రోజులు గడిపి. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేశారు. ఈ నేపథ్యంలో శుభాంశు రాక కోసం దేశమంతా నిలువెల్లా కనులు చేసుకుని ఆనందోత్సాహాలతో ఉత్కంఠగా వేచిచూస్తోంది.
సముద్రంలో స్ప్లాష్‌డౌన్ తర్వాత, శుభాంశు శుక్లా, సిబ్బంది సభ్యులను రికవరీ బృందం సముద్రం నుంచి సురక్షితంగా అందుకుంటుంది. హైడ్రాలిక్ క్రేడిల్ ఉపయోగించి స్పేస్‌క్రాఫ్ట్‌ను ఓడపైకి ఎక్కిస్తారు, అక్కడ వ్యోమగాములకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేస్తారు.
ఆ తర్వాత, వారిని హెలికాప్టర్ లేదా ఓడ ద్వారా భూమిపైకి తీసుకెళ్లి, మరిన్ని వైద్య పరీక్షలు, మిషన్ డీబ్రీఫింగ్, రికవరీ ప్రక్రియలను నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా, శుభాంశు శుక్లా భూమి గురుత్వాకర్షణకు అలవాటు పడటానికి ఫ్లైట్ సర్జన్ పర్యవేక్షణలో 7 రోజుల రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు.



