News

ముంచెత్తుతున్న వరదలు.. బ్రహ్మాంగారి కాలజ్ఞానం నిజమవుతుందా..?

బ్రహ్మంగారి కాలజ్ఞానం దడ పుట్టిస్తుంది. ఈ సంవత్సరం జరిగే అనర్థాలు తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పినట్టే భయంకరమైన భూకంపాలు వచ్చాయి. ఆ ప్రకృతి విలయానికి ప్రపంచం మొత్తం కన్నీరు కార్చింది. ఇక ముందు కూడా ఇలాంటి విపత్కర పరిస్థులు రాబోతున్నాయని.. ప్రకృతి విలయతాండవం ప్రపంచానికి పెను సవాలుగా మారనుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు చెప్తున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనలే ఉత్తరాఖండ్‌లో జరుగుతున్నాయి. అక్కడ వచ్చే ప్రళయానికి జనం విళవిలాడుతున్నారు.

ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకు జీవుడా అంటూ జీవిస్తున్నారు. ఇదే యుగాంతం అంతానికి మొదటి మొట్టుగా చెబుతున్నారు నిపుణులు. ఇక ముందు రాబోయే విపత్తును ఎదుర్కోంనేందుకు ఈ మానవాళి సిద్దంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు రాబోయే ప్రళయం ఏంటి..? బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం ఉంది..? అదే నిజమవుతుందా..?

దేవభూమి ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా జనజీవనం స్తంభించింది. ఉత్తరకాశీ జిల్లాలోని బార్‌కోట్‌-యుమునోత్రి మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 9 మంది గల్లంతయ్యారు. మరో 10 మందిని ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి స్పందించారు. తాజా పరిస్థితులపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

వర్షాల కారణంగా పలు ప్రధాన రహదారులు మూతపడ్డాయి. చమోలీ జిల్లాలోని నందప్రయాగ్ భానర్పానీ వద్ద కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేసినట్లు జిల్లా పోలీసులు ప్రకటించారు. యాత్రికులు, స్థానికుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ భరోసా ఇచ్చారు. ఈ పరిణామాలపై స్పందించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున చార్‌ధామ్ యాత్రను ఒక రోజు వాయిదా వేస్తున్నట్లు గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. సంబంధిత జిల్లాల పరిపాలన, సహాయక బృందాలను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, రోడ్డు మార్గాలను సమీక్షించిన తర్వాత తదుపరి ప్రయాణానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఆయన ఇచ్చారు. భక్తులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు.

జూన్ 30, జూలై 1 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఉత్తరాఖండ్‌కు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సహయక బృందాలను అలర్ట్ చేసింది.

ఈ నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్‌ధామ్ యాత్రను 24 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ముందుజాగ్రత్త చర్యగా చార్‌ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాకు తెలిపారు. హరిద్వార్, రుషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, వికాస్‌నగర్ వంటి కీలక ప్రాంతాల్లో యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో ఆపివేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

పరిస్థితులు చక్కబడే వరకు యాత్రికులు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆయన సూచించారు.ఈ వరదల కారణంగా చార్‌ధామ్‌ యాత్రను 24 గంటలపాటు అధికారులు నిలిపివేశారు. హరిద్వార్, రిషికేశ్‌, శ్రీనగర్‌, రుద్రప్రయాగ్‌, సోన్‌ప్రయాగ్‌, వికాస్‌ నగర్‌ వద్ద యాత్రికులను ఆపాలని స్థానిక యంత్రాంగానికి సమాచారమందించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ పోతులూరి వీర బ్రహ్మం గారి కాలజ్ఞానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడో నాలుగు వందల ఏళ్ల కిందటే మన దేశంలో.. ప్రపంచంలో జరగబోయే విషయాలు.. భవిష్యత్తును తన కాలజ్ఞానంలో చెప్పిన బ్రహ్మంగారంటే తెలుగు ప్రజలకు నమ్మకం ఎక్కువే. బ్రహ్మంగారి కాలజ్ఞానంపై ఎన్నో ఆడియోలు.. వీడియోలు.. చివరకు సినిమాలు కూడా మన తెలుగులో వచ్చాయి. ఆయన రచించిన తాళపత్ర గ్రంథాల్లోని భవిష్యవాణిని ప్రజలకు సరళంగా తెలిపేందుకు అనేక మాధ్యమాల ద్వారా ఔత్సాహికులు అందించారు.

80, 90వ దశకంలో అయితే ఏ ఇంట చూసిన బ్రహ్మం గారి కాలజ్ఞానం ఆడియో క్యాసెట్స్‌ దర్శనమిచ్చేవి. సమయం దొరికిన ప్రతిసారి సినిమా పాటల కన్నా ఎక్కువగా ఆ కాలజ్ఞానం ఆడియోలే వినేవాళ్లు జనాలు. అయితే జనంలో అంత క్రేజ్‌ రావడానికి కూడా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం మొత్తం నిజమవడం. ఆయన చెప్పిన ప్రతి విషయం జరుగుతూ వచ్చాయి.. అవన్నీ ప్రజలు కళ్లారా చూస్తున్నారు.

అంతటి నమ్మకం ఉన్న బ్రహ్మంగారే స్వయంగా రాసిన కాలజ్ఞానంలో ఈ 2025 సంవత్సరంలో జరగబోయే విషయాలను రాసినట్టు పండితులు చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం ప్రకృతి విపత్తులు వస్తాయని.. ప్రపంచం మొత్తం షాక్‌ కు గురవతుందని చెప్పారు ఆయన చెప్పినట్టు గానే ఈ మధ్యలో బ్యాంకాక్‌, మయన్మార్‌లలో వచ్చిన భూకంపాన్ని నిదర్శనంగా చూపిస్తున్నారు. దీంతో బ్రహ్మం గారి కాలజ్ఞానం మరోసారి నిజమైందని పండితులు చెప్తున్నారు. అలాగే ఈ సంవత్సరం మరిన్ని విపత్తుల సంభవించబోతున్నట్టు కాలజ్ఞానంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు.

ఈ సంవత్సరం ప్రపంచం గందరగోళ పరిస్థితిలోకి వెళ్తుందని కాలజ్ఞానంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. ఒక వైపు యుద్దాలు, ఇంకోవైపు వర్గ విద్వేషాలతో దేశాలు కుదేలైపోతాయని తెలిపారు. ఆకలి కేకలు ప్రపంచాన్ని చుట్టుముడతాయని.. యుద్దాల వల్ల బంగారం, ముడి చమురు రేట్లు ఆకాశాన్ని అంటుతాయని చెప్పారు. దీంతో ప్రజల రోజు వారి జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతాయన్నారు.

చైనా దిక్కులో కొత్త రోగం పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని.. మందు లేక ఈ వ్యాధి బారిన పడి ఎంతో మంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉందంటున్నారు. ఈ సంవత్సరం శ్రావణ, బాద్రపద మాసాల్లో అంటూ సెప్టెంబర్‌ మరియు అక్టోబర్‌ నెలల్లో మన దేశంలో ఒక వైపు తుపాన్లు దేశాన్ని అల్లకల్లోలం చేస్తే మరోవైపు తాగునీటకి ప్రజలు అష్టకష్టాలు పడతారని చెప్తున్నారు.

ఈ 2025 సంవత్సరం నుంచి సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చి తీరప్రాంత నగరాలను ముంచెత్తుతుందట.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button