జాతియం

Jaish terrorists: బీహార్‌లోకి జైషే ఉగ్రవాదుల చొరబాటు.. రాష్ట్రంలో హైఅలర్ట్‌

Jaish terrorists: జైషే మహ్మద్ కరుడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ. పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆరపరేషన్ సిందూర్‌తో పాక్‌లోని జైషే మహ్మద్ ప్రదాన కార్యాలయాన్ని కూల్చివేసింది. తాజాగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ మళ్లీ చురుగ్గా మారుతోంది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో జైషే మొహమ్మద్, దాని నాయకుడు మౌలానా మసూద్ అజర్ పాత్ర మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఇప్పుడు బిహార్‌లో జైషే మనుషులు కనిపించడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకీ జైషే సంస్థ భారత్‌పై గురిపెట్టడానికి కారణమేంటి..? ఎందుకు ఇండియాలోకి వారి మనుషులను పంపుతోంది..?

బీహార్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉగ్ర కలకలం రేగింది. జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రాష్ట్ర పోలీసులు హైఅలర్ట్‌ అయ్యారు. ఇప్పటికే ప్రచార పర్వాన్ని ప్రారంభించాయి అన్ని పార్టీలు.

బీహార్‌లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు రాష్ట్రంలో చొరబడ్డారంటూ ఇంటెలిజెన్స్‌ బ్యూరో సమాచారం దీంతో పోలీసులు ఇచ్చిన సమాచారంతో ప్రజలు అలర్ట్ అయ్యారు. ఆ ముగ్గురు ఉగ్రవాదుల ఫోటోలు, వివరాలతో సహా ప్రజల ముందు ఉంచారు. వీరు ఎక్కడ కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బీహార్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించారు అధికారులు. పాకిస్థాన్‌లోని రావల్పిండికి చెందిన హస్నైన్ అలీ.. ఉమర్‌కోట్‌కు చెందిన ఆదిల్ హుస్సేన్, బహవల్‌పూర్‌కు చెందిన మహ్మద్‌ ఉస్మాన్‌గా గుర్తించారు. వీరు పాక్‌ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహ్మద్‌ ముఠాకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు.

వీరంతా నేపాల్‌ మీదుగా బీహార్‌లోకి చొరబడ్డట్టు గుర్తించారు. ఈ నెల రెండో వారంలోనేపాల్‌కు చేరుకున్న వీరు అక్కడి నుంచి బీహార్‌లోకి చొరబడ్డారు. మరోవైపు నేపాల్‌ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉగ్రవాదుల చొరబాటు తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ ఏడాది చివర్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రస్తుతం ఈ రాష్ట్రంలోనే పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్‌ను పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్‌ సరిహద్దుల్లో గస్తీని కూడా పెంచారు. నేపాల్‌తో సరిహద్దు ఉన్న జిల్లాలతో పాటు సీమాంచల్‌ ప్రాంతంలో భద్రతను పెంచారు.

రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. చెక్‌ పోస్టుల వద్ద పెట్రోలింగ్‌ను పెంచారు. నేపాల్‌తో సరిహద్దు ఉన్న జిల్లాలతో పాటు సీమాంచల్‌ ప్రాంతంలో భద్రతను పెంచారు. రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. చెక్‌ పోస్టుల వద్ద పెట్రోలింగ్‌ను పెంచారు.

నిజానికి ఆపరేషన్ సిందూర్ సమయం నుంచి భద్రతను పెంచారు. అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అలాగే కొనసాగిస్తున్నారు. బీహార్‌లోని ఏడు జిల్లాలు నేపాల్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. అయితే 729 కిలోమీటర్ల పొడవైన ఓపెన్‌ బార్డర్‌ ఉండటం ఇప్పుడు భద్రతా బలగాలకు సవాల్‌గా మారింది.

ఇక్కడ మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. ఈ ఏడాది మే నెలలోనూ బిహార్‌లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిఘా వర్గాలు గుర్తించాయి. గడిచిన 20 రోజుల్లో మొత్తం 18 మంది కొత్త వ్యక్తులు బీహార్‌లో చొరబడినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు ఖలిస్థానీ అని కూడా అనుమానిస్తున్నారు. ఈ రాష్ట్రం 729 కిలోమీటర్ల మేర నేపాల్‌తో సరిహద్దు పంచుకుంటోంది. దీంతో అక్రమ చొరబాట్లకు హాట్‌స్పాట్‌గా మారుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button