ఆంధ్ర ప్రదేశ్
మాజీ MLA కేతిరెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు

Kethireddy: వైసీపీ నేత, మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం కేతిరెడ్డి నివాసం వద్ద తన ఇంటి సరిహద్దుల్ని సిబ్బంది సర్వే చేస్తోంది. సీఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కేతిరెడ్డి నివాసం ఉండగా కేతిరెడ్డి ఇంటి సరిహద్దులు సర్వే అనంతరం కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.