సినిమా

కన్నప్ప సంచలనం: బాహుబలి రేంజిలో రిలీజ్‌!

Kannappa: మంచు విష్ణు హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప” గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. స్టార్ హీరోల సమాహారంతో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.

విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన “కన్నప్ప” చిత్రం భారతీయ సినిమా రంగంలో సరికొత్త రికార్డులకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రముఖ దర్శకుడు ముకేష్ కుమార్ సింగ్ రూపొందించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా 5,400కి పైగం స్క్రీన్లలో విడుదల కానుంది. ఇండియాలోనే 4,000 స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితం కానుంది, ఇందులో ఐమ్యాక్స్, 4DX వెర్షన్లు కూడా ఉన్నాయి.

మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో, స్టీఫెన్ డేవస్సీ సంగీతంతో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్‌ వంటి స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కన్నప్ప భక్తుడి కథాంశంతో రూపొందిన ఈ చిత్రం దృశ్య వైభవం, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ చిత్రం విష్ణు మంచు కెరీర్‌లోనే అతిపెద్ద రిలీజ్‌గా నిలవనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button