తెలంగాణ
Harish Rao: పల్లెలపై రేవంత్ ప్రభుత్వానికి ఉన్న పట్టు ఇదేనా..?

Harish Rao: సీఎం రేవంత్ పాలనా తీరుపై మాజీమంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. మెదక్ జిల్లాలోని చిప్పల్తుర్తిలో పర్యటించిన హరీష్ రావు.. అక్కడి సమస్యలను స్వయంగా అడిగి తెలుసు కున్నారు. గ్రామాలు క్లీన్గా ఉండాలని కేసీఆర్ ట్రాక్టర్లు అందిస్తే.., ఇప్పుడు అదే ట్రాక్టర్లో డీజిల్ పోయని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందంటూ మండిపడ్డారు. డీజిల్ లేకపోవడంతో 20రోజుల నుండి చెత్త సేకరణ జరగడం లేదన్నారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా అంటూ హరీష్ రావు నిలదీశారు.