తెలంగాణ
Hyderabad: మానసిక బాలికపై వైద్యుడు లైంగిక దాడి

Hyderabad: హైదరాబాద్ హబ్సిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓయూ పీఎస్ పరిధిలో మతిస్థిమితం లేని నాలుగేళ్ల బాలికపై వైద్యుడు రంజిత్ లైంగికదాడికి పాల్పడ్డాడు. నాలుగు నెలల నుంచి హబ్సిగూడ వైబ్రంట్ వింగ్స్ చిల్డ్రన్ డెవలప్మెంట్ కేర్లో చిన్నారి వైద్యం తీసుకుంటుంది. చిన్నారి మానసిక స్థితి బాలేదని తెలుసుకున్న రంజిత్ అదే అదునుగా లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఇక చిన్నారి పరిస్థితిపై అనుమానం వచ్చిన తల్లి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లింది. విషయం తల్లికి వివరించడంతో చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.