ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి

తిరుమల శ్రీవారిని ఏపీ రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఏపీ మహిళలకు తీపికబురు చెప్పారు.
ఆగస్ట్ నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తయిందన్నారు. శ్రీవారి ఆశీస్సులు ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.



