తెలంగాణ
రామకృష్ణాపురంలోని వారాహి ప్రత్యంగిరా అమ్మవారి ఉత్సవాలు

కొత్తపేట రామకృష్ణాపురంలోని వారాహి ప్రత్యంగిరా అమ్మవారి ఆలయంలో ఈనెల 26 నుంచి నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను చీకోటి ప్రవీణ్ ప్రారంభించారు. వారాహి ప్రత్యంగిరా అమ్మవారిని దర్శించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని చీకోటి ప్రవీణ్ అన్నారు.
అలాగే నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్‌ను ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. అమ్మవారి హోమంలో పాల్గొంటే ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయని అన్నారు.