అంతర్జాతీయం

Donald Trump: మస్క్ కు మతి పోయిందని..నేను అతనితో ఇక మాట్లాడను

Donald Trump: బిలియనీర్ ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వైరం ముదిరింది.ట్రంప్ రెండో సారి అధికారం చేపట్టాక వారి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ డెవలప్ అయినప్పటికీ తాజాగా వారిమధ్య విభేదాలు పెరిగాయి.ప్రస్తుతం వారిద్దరు బహిరంగంగా మాటల యుద్దం చేస్తున్నారు. ఇంతకీ ఎందుకు ఎలాన్ మస్క్ కు, ట్రంప్ మధ్య వివాదం వచ్చింది. ఎందుకు బహిరంగంగా తిట్టుకుంటున్నారు.

ఒకరు ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశానికి అధిపతి. మరొకరేమో ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త. వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో సాగిన మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఎలాన్‌ మస్క్‌ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బిలియనీర్ ఎలాన్ మస్క్ కు మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్దం నడిచింది. ఒకరిపైఒకరు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. నువ్వెంత అంత అంటే నువ్వెంత అనే స్థాయికి మాటలు పెరిగాయి. ఇది బాగా వైరల్ అయింది. ఓ పన్నుల బిల్లువిషయంలో ఎలాన్ మస్క్ ట్రంప్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అందుకు ట్రంప్ బదులుగా టెస్లా వంటి మస్క్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను నిలిపివేస్తానని బెదిరించారు.

ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ పన్ను బిల్లును ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దారుణమైనది అని విమర్శించారు. ఈ బిల్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టాన్ని కలిగిస్తుందని మస్క్ వాదించారు.ఈ బిల్లులో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రెడిట్లు లేకపోవడం కూడా మస్క్ అసంతృప్తికి ఒక కారణంగా తెలుస్తోంది.

మస్క్ విమర్శలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. టెస్లా వంటి మస్క్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను, పన్ను రాయితీలను ఆపేస్తానని ట్రంప్ బెదిరించారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో గెలిచేవాడినని, మస్క్ మద్దతు తనకు అవసరం లేదని ట్రంప్ తేల్చేశారు. మస్క్ కు చాలా సహాయం చేశానని..అయినా అతనికి కృతజ్ఞత లేదని ఫైర్ అయ్యారు. తాజాగా మరోసారి మస్క్‌పై ఎదురుదాడికి దిగారు ట్రంప్. మస్క్ కు మతి పోయిందని నేను అతనితో ఇక మాట్లాడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను మస్క్ కు చాలా సహాయం చేశానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ కౌంటర్ కూడా ఇచ్చారు. తాను లేకపోతే ట్రంప్ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయేవారన్నారు. వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్ ను తనకు ఒకసారి కూడా చూపించలేదని అన్నారు. కానీ దానిపై ట్రంప్ చేస్తున్న వాదనను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. బిల్లులోని ఈవీ, సోలార్ ప్రోత్సాహకాల కోతలపై అనవసర ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button