Upasana - Janhvi Kapoor: జాన్వీ కపూర్ కి రామ్ చరణ్ భార్య స్పెషల్ గిఫ్ట్

Upasana – Janhvi Kapoor: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పైగా అప్పుడప్పుడు రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ దగ్గర కనిపిస్తుండటంతో ఈ సినిమా లుక్స్ లీక్ అవుతున్నాయి. ఆ లుక్స్ అదిరిపోయింది అంటున్నారు ఫ్యాన్స్. వచ్చే దసరాకు ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన జాన్వీ కపూర్ కి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ కలిసి అత్తమ్మాస్ కిచెన్ అని ఇన్స్టంట్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో జాన్వీ కపూర్ చరణ్ ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఉపాసన ఈ అత్తమ్మాస్ కిచెన్ నుంచి పలు ఇన్స్టంట్ ఫుడ్ ప్యాకెట్స్ ఉన్న గిఫ్ట్ బాక్స్ జాన్వీకి ఇచ్చింది.ఈ ఫోటోని ఇప్పుడు అత్తమ్మస్ కిచెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది బాగా వైరల్ అవుతుంది.