సినిమా

జైలర్-2లో మరో సీనియర్ బ్యూటీ?

Jailer 2: తైలవా రజనీకాంత్ ‘జైలర్-2’ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ అతిథి పాత్రలో నటిస్తుంది. ఇందులో మిథున్ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన కుమార్తెగా కనిపించనున్న విద్యా తమిళంలో మరోసారి అడుగుపెట్టనుంది.

నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్-2’లో బాలీవుడ్ హాట్ నటి విద్యాబాలన్ గెస్ట్ రోల్ చేయనుంది. ఆమెకు ఇది తమిళంలో రెండో అవకాశం. గతంలో అజిత్ ‘నేర్కొండ పార్వై’లో గెస్ట్‌గా నటించిన విద్యా ఇప్పుడు రజనీ సరసన కనిపించబోతోంది.

సన్ పిక్చర్స్ నిర్మాణంలో కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కోయంబత్తూరులో జరుగుతోంది. ‘జైలర్’ కాస్ట్ అంతా ఈ సీక్వెల్‌లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు విద్యా బాలన్ ఎంట్రీ కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button