జాతియం

Uttar Pradesh: మహిళ తలపైకి ఎక్కి.. షాపింగ్‌ మాల్‌లో గందరగోళం సృష్టించిన కోతి.. వీడియో వైరల్‌

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఝాన్సీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఝాన్సీలోని సిటీ కార్ట్‌ మాల్‌లోకి ఓ కోతి ప్రవేశించింది. అక్కడ ఓ మహిళ తలపైకి ఎక్కి దాడి చేసింది. యువతిని గోర్లతో గీకడం, తల లాగడం వంటివి చేసింది. పదేపదే ఆమెపై దాడి చేసింది. ఆమె కాళ్లకున్న షూను లాగేసింది. ఈ ఘటనతో సిబ్బంది, కస్టమర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

కోతిని బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అరటిపండు ఆశ చూపారు. దుప్పటితో దాన్ని బంధించాలని ప్రయత్నించారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆ కోతి వారికి చిక్కకుండా మాల్‌లోని స్టాండ్‌లపై గెంతులేస్తూ గందరగోళం సృష్టించింది. సిబ్బందిని పరుగులు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

https://twitter.com/i/status/1877931713307001267

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button