సినిమా

Dhanush-Mrunal Thakur: ధనుష్ – మృణాల్ మళ్లీ డేటింగ్?

Dhanush-Mrunal Thakur: సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న ధనుష్ మళ్లీ ప్రేమ వార్తల్లో చిక్కుకున్నాడు. ఈసారి హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో ఆయనకు సంబంధం ఉందనే పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరి ఇంటరాక్షన్ ఈ చర్చను మరింత రాజేసింది.

ధనుష్ గతంలో మృణాల్ ఠాకూర్‌తో కలిసి ఓ సినిమా ఈవెంట్‌కు హాజరయ్యారు. అక్కడ వీరిద్దరూ సన్నిహితంగా కనిపించడంతో డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత కొంతకాలం ఈ విషయం చల్లారినట్టు కనిపించింది. కానీ ఇటీవల మృణాల్ తన ఇంస్టాగ్రామ్లో కొత్త ఫిల్మ్ ‘దో దివానే షహర్ మే’ టీజర్‌ను విడుదల చేసింది.

దానికి ధనుష్ తక్షణమే “చూడడానికి, వినడానికి చాలా బాగుంది” అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి మృణాల్ హార్ట్, సన్ ఫ్లవర్ పువ్వు ఎమోజీలతో రిప్లై ఇవ్వడంతో మళ్లీ పుకార్లు జోరుగా వ్యాపించాయి. ఈ స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇద్దరిలో ఎవరూ ఈ విషయంపై స్పందించలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button