జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ సునీత హైకోర్టును ఆశ్రయించారు. ప్రజాప్రాతినిథ్య చట్టం నియమ నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తూ నవీన్ యాదవ్అ క్రమంగా ఎన్నికయ్యారని సునీత పిటిషన్‌లో ఆరోపించారు.
ఎన్నికల చట్టాల ప్రకారం, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు నామినేషన్లలో అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆస్తులు, నియమావళులు తూచా తప్పకుండా పాటించాలని అయితే వాటని నవీన్ యాదవ్ విస్మరించారని ఆరోపిస్తూ మాగంటి సునీత రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
గతంలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారి విషయంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు సైతం సునీత తన పిటిషన్‌లో ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి వివాదాస్పదమైన చెన్నమనేని రమేష్ వర్సెస్ ఆది శ్రీనివాస్, గద్వాల్ కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ డీకే అరుణ, కొప్పుల ఈశ్వర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ తదితరుల కేసులు గతంలో హైకోర్టులో నడిచాయి. తాజాగా మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ పిటిషన్ హాట్ టాపిక్ అవుతోంది.



