ఆంధ్ర ప్రదేశ్

ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న గౌతమి 4 ఏళ్లుగా కార్తీక్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకుందామని కార్తీక్‌ను కోరగా అతడు నిరాకరించాడు.

దీంతో మనస్తాపానికి గురైన గౌతమి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేపట్టారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button