జననాయగన్ సెన్సార్ గందరగోళం.. రిలీజ్ పై నో క్లారిటీ!

తమిళ స్టార్ హీరో థలపతి విజయ్ చివరి సినిమాగా భావిస్తున్న జననాయగన్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం తీవ్ర సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. పొంగల్ సందర్భంగా జనవరి 9న విడుదల కావాల్సిన ఈ చిత్రంలో సెన్సార్ చాలా కట్స్ విధించింది. ఆ కట్స్ కి మూవీ టీం ఒప్పుకోక, మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. దీంతో మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించినా డివిజన్ బెంచ్ ఆ ఆర్డర్‌పై స్టే విధించింది. అయితే నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా మరోసారి షాకింగ్ ట్విస్ట్ వచ్చింది. సుప్రీం కోర్టు నుంచి ఊరట రాదని తేలింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఇంటరిం స్టేను సుప్రీం కోర్టు కొట్టివేయలేదు. దీంతో ఈ చిత్రం రిలీజ్ మరింత ఆలస్యమవుతుంది. ఇప్పుడు నిర్మాతలు మళ్లీ మద్రాస్ హైకోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది. జనవరి 20న సీజే బెంచ్ ముందు కేసు విచారణ జరగనుంది. ఈ పరిణామాలు థలపతి విజయ్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి.
థలపతి విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు చివరి సినిమాగా ఎన్నో ఆశలతో విడుదల కాబోతున్న జననాయగన్ ఇప్పుడు సెన్సార్ గందరగోళంలో చిక్కుకుంది. భగవంత్ కేసరి రీమేక్‌గా ఈ చిత్రాన్ని పొంగల్ రోజున జనవరి 9న థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు నిర్మాతలు KVN ప్రొడక్షన్స్ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే సెన్సార్ బోర్డు ఫిర్యాదు ఆధారంగా సినిమాను రివైజింగ్ కమిటీకి పంపింది. దీంతో రిలీజ్ ఆగిపోయింది. మద్రాస్ హైకోర్టులో కేసు విన్న సింగిల్ జడ్జి యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించగా డివిజన్ బెంచ్ ఆ ఆదేశాలపై తక్షణ స్టే విధించి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. దీంతో నిర్మాతలు సుప్రీం కోర్టుకు వెళ్లారు.
అక్కడ కూడా షాక్ తగిలింది. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకుండా నిరాకరించడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఇంటరిం స్టే కొనసాగుతుంది. దీంతో చిత్ర రిలీజ్ పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు నిర్మాతలు మళ్లీ హైకోర్టు విచారణలో తమ వాదనలను బలంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. జనవరి 20న చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ముందు రిట్ అప్పీల్ విచారణ జరగనుంది. ఈ కేసు ఫలితంపైనే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ పరిణామాలతో థియేటర్లలో ఎప్పుడు విడుదల అవుతుందనే అంచనాలు పూర్తిగా మారిపోయాయి. ఫ్యాన్స్ మధ్య ఆందోళన, నిరీక్షణ కలగలిసి కనిపిస్తున్నాయి.
ఇక ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 83 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించినా ఈ లీగల్ ప్రాబ్లెమ్స్ వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమవుతుంది. రాజకీయంగా రాహుల్ గాంధీ ఈ విషయాన్ని తమిళ సంస్కృతిపై దాడిగా చిత్రీకరిస్తూ మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారనే వార్తలు కూడా నెట్టింటా వస్తున్నాయి. విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన TVK పార్టీతో పోటీ చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఈ ఆలస్యం మరింత చర్చనీయాంశమైంది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ థలపతి రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.



