ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం

నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి స్కెచ్ వేసింది. ఇప్పటికే అవిశ్వాసానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవిశ్వాసానికి అనుకూలంగా 40 మంది కార్పొరేటర్ల సంతకాలు చేశారు. నేడు కలెక్టర్‌కు కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇవ్వనున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లో టీడీపీ మెజార్టీ సాధించింది.



