మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం ఓటర్ల సంఖ్య 52 లక్షల 17 వేల 413 మంది ఓటర్లు కాగా.. వారిలో పురుషులు 25 లక్షల 61వేలు.. మహిళలు 26 లక్షల 80 వేల మంది ఉన్నారు. 116 మున్సిపాలిటీల్లోని 2 వేల 569 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. మున్సిపాలిటీ బరిలో 10 వేల 719 మంది అభ్యర్థులు ఉన్నారు.
7 కార్పొరేషన్లలో 412 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా.. పోటీలో 2 వేల 225 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 8 వేల 191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 13 వందల 2 కాగా.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 19 వందల 26 గుర్తించారు. పోలింగ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తున్నారు.



