సినిమా
మెగాస్టార్ క్రేజ్.. చిరు సినిమా టికెట్‌ను రూ.లక్షకు సొంతం చేసుకున్న అభిమాని

మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ వరప్రసాద్ బెనిఫిట్ షో టికెట్‌ను వేలంపాటలో కొనుక్కునేందుకు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో మెగా అభిమానులు పోటీపడ్డారు. అన్నపూర్ణ థియేటర్లో మెగాస్టార్ అభిమాన సంఘం నిర్వహించిన వేలంపాటలో నర్సాపురం పట్టణానికి చెందిన చాగంటి గణేష్ ఒక్క లక్షకు టికెట్‌ను కొనుగోలు చేశారు.
రాష్ట్రంలో అత్యధిక మొత్తంలో బెనిఫిట్ షో టికెట్ కొనుగోలు చేసిన ముగ్గురు అభిమానులన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు కలిసే అవకాశం ఉండటంతో అభిమానులు ఈ వేలంపాటలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.



