రాజాసాబ్ రిలీజ్ ఆలస్యం?

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రం రిలీజ్ జనవరి 9, 2026కి ఆలస్యమవుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉండటంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగారు. టీమ్‌ని ట్యాగ్ చేస్తూ స్పష్టత కోరుతున్నారు.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతుంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రిలీజ్ ఆలస్యమవుతుందని వార్తలు రేకెత్తిస్తున్నాయి. జనవరి 9, 2026 రిలీజ్ డేట్ సాధ్యం కాదని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాలేదని సమాచారం. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో టీమ్‌ని ట్యాగ్ చేస్తూ రిలీజ్ డేట్ పుకార్లపై స్పష్టత కోరుతున్నారు. ఇటీవల యూరప్‌లో ఒక పాట చిత్రీకరణ పూర్తయింది. ఇందులో ప్రభాస్‌తోపాటు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రభాస్‌కు ఇది పూర్తి కొత్త జోనర్. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మారుతి అద్భుతమైన ఎలిమెంట్స్ సిద్ధం చేశాడని తెలుస్తోంది.



