సినిమా

RC 16 నుంచి ఫ్యాన్స్ కి బర్త్ డే సర్ప్రైజ్

RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్‌లో 16వ సినిమాగా వస్తున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే కావడంతో, ఆ రోజున ఏదో ఒక స్పెషల్ అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించి ఇప్పుడు ఓ న్యూస్ వచ్చేసింది.

RC 16 టైటిల్, గ్లింప్స్ రెడీ అయిపోయాయట. పైగా గ్లింప్స్ కి ఏ.ఆర్. రెహమాన్ అదిరిపోయే సూపర్ స్కోర్ ఇచ్చాడట. ‘పెద్ది’ అనే టైటిల్‌తో ఈ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో జరుగుతోంది, హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ అయిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో షూట్ చేయబోతున్నారు. ఇక ఈ సూపర్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button