తెలంగాణ

మలక్‌పేట్ గంజ్ మార్కెట్‌ను ప్రారంభించిన కవిత

హైదరాబాద్ మలక్‌పేట్ గంజ్ మార్కెట్‌ను జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రారంభించారు. మార్కెట్‎‎లో హమాలీలు, డైలీ కూలీలు, వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 43 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మార్కెట్‌ను కాపాడుకోవాలని, మార్కెట్‌లో కనీస సౌకర్యాలు అత్యవసరమని అదేవిధంగా త్రాగు నీరు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను వెంటనే అభివృద్ధి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆమె కోరారు. మార్కెట్‎లో ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ వంతు సహాయం కొనసాగుతుందని జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button