ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమల ఆలయ వెండివాకిలి వద్ద చోరీలు.. అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూలైన్లలో వేచి ఉండే మహిళా యాత్రికుల మెడలో ఉన్న మంగళ సూత్రాలు కాజేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. రద్దీ, తోపులాటల సమయంలో యాత్రికుల దృష్టి మరల్చి చాకచక్యంగా ఈ ముఠా దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

శ్రీవారి ఆలయ వెండివాకిలి, పిఎసి-3 దగ్గర కొందరు మహిళల మంగళ సూత్రాలను ఈ దొంగలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మహారాష్ట్రకు చెందిన ఆరుగురు దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి 87 గ్రాముల బంగారు ఆభరణాలు, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button