సినిమా

Tamannaah: టాలీవుడ్ లో తమన్నా మరో స్పెషల్ సాంగ్‌?

Tamannaah: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. దర్శకుడు అనిల్ రావిపూడి కమర్షియల్ అంశాలతో ఈ పాటను చేర్చారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ పూర్తి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ అంతిమ దశలో ఉంది. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్‌ను జోడించారు.

మిల్కీ బ్యూటీ తమన్నా ఈ పాటలో నటిస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సాంగ్‌ను డిజైన్ చేశారు. సాహు గారపాటి, సుస్మిత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్నా స్పెషల్ సాంగ్ సినిమాకు మరింత ఆకర్షణను తెస్తుందని అంచనా వేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button