ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

Tirumala: తిరుమల వెంకన్నను పలువురు ప్రముఖులు దర్శించుకొని మ్రొక్కులు చెల్లించారు. ఎపి మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి రోజా, సినీనటులు రవళి, జ్యోతి ఇవాళ ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో వేరువేరుగా ఆలయంలోకి వెళ్లి గర్భగుడిలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు, అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.



