Good Bad Ugly: అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ 200 కోట్ల సంచలనం

Good Bad Ugly: కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. త్రిష హీరోయిన్‌గా, యంగ్ డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం అజిత్ ఫ్యాన్స్‌కు పూర్తి వినోదాన్ని అందిస్తోంది.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రిలీజైన మొదటి రోజు నుంచే సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. తమిళనాడులో కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం, వారం రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 200 కోట్ల గ్రాస్‌ను దాటేసిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. అజిత్ ఫ్యాన్స్ థియేటర్లలో పండగ చేసుకుంటున్నారు.
జీవి ప్రకాష్ సంగీతం, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంతో రూపొందిన ఈ చిత్రం వసూళ్లపరంగా ఎక్కడ ఆగుతుందనేది ఆసక్తికరం. మేకర్స్ అధికారిక గణాంకాలను రివీల్ చేయకపోయినా, సినిమా సాలిడ్ రన్ కొనసాగిస్తోంది. మరి, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బాక్సాఫీస్ రికార్డులను ఎలా బద్దలు కొడుతుందో చూడాలి.