తెలంగాణ

Rajasingh: 11ఏళ్ల నుంచి నన్ను కూడా ఫుట్‌బాల్ ఆడుకున్నారు

Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చే శారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు తెలిపారు.చేవెళ్ల ఎంపీ పార్టీ నాయకత్వానికి ఫుట్‌బాల్ గిఫ్ట్‌గా ఇచ్చారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 11ఏళ్ల నుంచి తనను కూడా ఫుట్‌బాల్ ఆడుకున్నారని ఆయన విమర్శించారు. భవిష్యత్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు ఫుట్‌బాల్ గిఫ్ట్‌లు ఇస్తూనే ఉంటారని అన్నారు.

బీజేపీలో ప్రత్యర్థులతో పోటీ ఉండదు సొంత పార్టీ నేతలతో పోటీ ఉంటుందని అన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్ బాల్ గిఫ్ట్ ఇచ్చారంటే ఆయనలో ఎంత బాధ ఉందో అర్ధమవుతుందని అన్నారు. ఇతర పార్టీల నేతలు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు టచ్ లో ఉన్నారని రామచందర్ రావు అంటున్నారు కానీ బీజేపీలో ఉన్న సీనియర్ నేతలను ఎమ్మెల్యేలు, ఎంపీలు చేద్దామని ఎందుకు ఆలోచన చేయడం లేదని ఆయన విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button