ఆంధ్ర ప్రదేశ్
హోలీ అంటూ.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ అరెస్ట్

సత్యసాయి జిల్లా కదిరిలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినిలపై నీళ్లు చల్లుతూ పరిగెత్తించాడు. అంతటితో ఆగకుండా ఎత్తుకొని వెళ్లి బురదలో పడేసి దొర్లించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు అందించారు. హోలీ పండగ సందర్భంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు ప్రిన్సిపల్ వెంకటపతిపై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు కళాశాల ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ప్రిన్సిపల్ వెంకటపతికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.