సినిమా

డాన్ 3లో హృతిక్?

Hrithik Roshan: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కెరీర్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. వార్ 2 నిరాశ అనంతరం క్రిష్ 4కు ఆర్థిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో హృతిక్ ఇతర ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాడు. ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ డాన్ 3లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే టాక్ నడుస్తోంది.

హృతిక్ రోషన్ వార్ 2 విఫలమవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. క్రిష్ 4కు నిర్మాణ సంస్థలు ముందుకు రావడం లేదు. దీంతో హృతిక్ ఇతర సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో సినిమా ఉండవచ్చనే బజ్ నడిచింది.

ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ డాన్ 3 కోసం హృతిక్‌ను అప్రోచ్ చేసినట్టు సమాచారం. రణవీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా, మేకర్స్ హృతిక్‌ను తీసుకురావాలని నిర్ణయించారు. హృతిక్ స్టైలిష్ లుక్ డాన్ పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని ఫర్హాన్ భావిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ తర్వాత స్టైలిష్ డాన్‌గా హృతిక్ కనిపిస్తాడా అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button