తెలంగాణ
కేటీఆర్ చొరవతో భారత్ చేరుకున్న గల్ఫ్ బాధితుడు

ఏజెంట్ మోసంతో గల్ఫ్‌లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండాలనికి చెందిన బాలసాని గౌరయ్య ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో బాలసాని తన స్వగ్రామానికి చేరాడు. బస్వాపూర్‌కు చెందిన బాలపారి గౌరయ్య రెండు నెలల క్రితం గల్ఫ్ దేశమైన మస్కట్లో ఏజెంట్ మోసానికి బలై అక్కడే చిక్కుకున్నాడు. తనను ఆదుకుని స్వదేశానికి తీసుకెళ్లాలని ఇటీవల సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్ట చేశాడు.
దీంతో ఈ వీడియోపై స్పందించి కేటీఆర్ వెంటనే మస్కట్ ఎంబసీకి లేఖ రాశారు. ఎంబసీ అధికారులు, కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం బాధితుడు పాస్‌పోర్టు కంపెనీ నిర్వాహకులు తిరిగి ఇవ్వడంతో బాలసాని తిరిగి భారత్ చేరుకున్నాడు. తనని స్వదేశానికి తీసుకొచ్చేందుక కృషి చేసిన కేటీఆర్, సామాజిక సేవ కార్యకర్త షేక్ అహ్మద్‌లకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.



