Health Tips: చలికాలంలో దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్..

పసుపు
దగ్గు, జలుబు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్, యాంటీవైరల్ లక్షణాలు కఫాన్ని తగ్గిస్తాయి.
వాము
రాత్రిపూట పొడిదగ్గు తీవ్ర ఇబ్బంది పెడుతుంది. నిద్రపట్టకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాబట్టి పడుకోవడానికి ముందు చిటికెడు వామును చేతిలో నలిపి.. దవడకు పెట్టుకుని కాసేపు చప్పరించాలి. దీనివల్ల దగ్గు అదుపులోకి వస్తుంది.
తులసి
జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట తులసి ఆకులను నమలాలి.
తేనె
గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా తేనె కలిపి తాగడం ద్వారా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. లేదంటే ఒక స్పూన్ తేనెలో కొన్ని చుక్కల అల్లం రసం లేదా నిమ్మరసం జోడించి తీసుకోవచ్చు.
అల్లం
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దగ్గు నివారణకు అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి రోజూ ఒక గంట పాటు తినడం వల్ల కూడా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.