Nidhhi Agerwal: హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

Nidhhi Agerwal: హైదరాబాద్‌లో రాజాసాబ్ పాట లాంచ్ ఈవెంట్లో నిధి అగర్వాల్ ఇబ్బంది ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. భారీ జనరద్దీతో నలిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఆమె సహనం కోల్పోకుండా ప్రమోషన్లు కొనసాగించి, ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటుంది.
హైదరాబాద్ కూకట్పల్లి లులు మాల్లో రాజాసాబ్ రెండో పాట లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఈవెంట్ మేనేజ్మెంట్ లోపాల వల్ల పరిస్థితి అదుపు తప్పింది. హీరోయిన్ నిధి అగర్వాల్ జనసమూహం మధ్య నలిగిపోయే పరిస్థితిని ఎదుర్కొంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ నిధి సంయమనం కోల్పోలేదు.
నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించినా ఎలాంటి విమర్శలు చేయకుండా ప్రమోషన్ కార్యక్రమాలను కొనసాగించింది. అనూహ్య ఇబ్బందులు ఎదురైనప్పటికీ సినిమా ప్రచారంలో ముందుండటం ఆమె సహనాన్ని చాటిచూపింది. ఈ ఘటనతో నిధి అగర్వాల్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



