ఆంధ్ర ప్రదేశ్
Bharath: బాలకృష్ణ స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా?

Bharath: ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్‌ను అవహేళనగా మాట్లాడారని అన్నారు. గతంలో మోడీ తల్లిని కూడా బాలకృష్ణ కించపరుస్తూ మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. మంత్రిని కూడా వాడు..వీడు అని అన్నారు. మా నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడితే సౌండ్ రీ సౌండ్ వస్తుందని ఎమ్మెల్సీ భరత్ హెచ్చరించారు.



